Header Banner

మందుబాబులకు అదిరిపోయే ఆఫర్! బాటిల్ కొంటే టోకెన్.. లాటరీ గెలిస్తే థాయ్‌లాండ్ టూర్!

  Mon Feb 03, 2025 09:49        Others

వ్యాపారస్తులు బిజినెస్ ను పెంచుకొనేందుకు.. కష్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక ట్రిక్కులను ఉపయోగిస్తారు. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. గిఫ్ట్ కూపన్స్.. డిస్కౌంట్ ఆఫర్స్.. లాటరీ ద్వారా బహుమతులు ఇలా ఒకటేమిటి అనేకమైనవి వింటున్నాం.. చూస్తున్నాం. అయితే తాజాగా ఇప్పుడు ఓ మద్యం వ్యాపారి ఆ షాపులో చుక్క తాగకుండానే కిక్కు ఎక్కే ఆఫర్ ప్రకటించాడు. కాకినాడకు చెందిన ఓ లిక్కర్ షాపు యజమాని మందు తాగండి .. థాయ్లాండ్ వెళ్లండి అంటూ పోటీలు ఏర్పాటు చేశాడు. తన దుకాణంలో అన్నిరకాల బ్రాండ్లు దొరుకుతాయంటూ.. మద్యం కొన్న వారికి టోకెన్లు ఇస్తామని ప్రకటించారు.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 



కావలసిన బ్రాండ్ ను ఫుల్లుగా తాగడమే కాదు ఫ్రీగా.. థాయ్లాండ్ వెళ్లే అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ ప్రకటించాడు. మద్యం ప్రియులు తమ షాపులో బాటిల్ కొంటే.. టోకెన్ ఇస్తామని... లాటరీ లో గెలుపొందిన వారికి కారు, బైక్, సెల్ఫోన్ వంటి గిఫ్ట్లను రూ. 1.5 లక్షల విలువైన బహుమతులు ఉన్నాయి. అంతే కాదు లాటరీ లో మొదటి బహుమతి గెలుపొందిన వారు ఏకంగా థాయ్ లాండ్ వెళ్లొచ్చు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ప్రకటన చూసిన మందుబాబులు కాకినాడలోని ఆషాపునకు క్యూ కట్టారు. మరి థాయ్లాండ్ టూర్ అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #wineshops #bottleoffer #goatour #todaynews #flashnews #latestupdate